HPCL: హెచ్‌పీసీఎల్ లో ఎగ్జిక్యూటివ్స్ రిక్రూట్‌మెంట్! 2 d ago

ముంబయిలోని హిందుస్థాన్ పెట్రోలియం లిమిటెడ్ (హెచ్‌పీసీఎల్) జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జేఈ) మెకానికల్ -11, జేఈ (ఎలక్ట్రికల్)-17, జేఈ (ఇన్‌స్ట్రుమెంటేషన్) - 6, జేఈ (కెమికల్)-1, జేఈ (ఫైర్ అండ్ సేఫ్టీ)-28 మొత్తం 63 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హత ఇంజినీరింగ్‌లో మూడు సంవత్సరాల రెగ్యులర్ డిప్లొమా చేసి ఉండాలి. వయసు 25 సంవత్సరాల లోపు ఉండాలి. దరఖాస్తు ఫీజు రూ. 1180/- ఎస్సీ/ఎస్టీ దివ్యాంగులకు ఫీజు లేదు. ఎంపిక ప్రక్రియ రాత పరీక్ష, గ్రూప్ డిస్కషన్, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, వైద్య పరీక్షలు, ఫిజికల్ ఫిట్‌నెస్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆధారంగా ఉంటుంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది ఏప్రిల్ 30. పూర్తి వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.